స్లయిడ్‌షో

Loading...

సైన్ ఇన్ అవ్వండి

Daily Calendar

గురువారం 25 ఫిబ్రవరి 2010

ప్రత్యేకవాద రాజకీయాలెందుకు?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నానాటికి దిగజారుతున్న వైనం ప్రజల్లో ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోయే విధంగా చేస్తోంది. వెనుకబడిపోయామంటూ ఒక ఉద్యమ సంస్థను స్థాపించి....ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తీసుకొచ్చారు టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు. వెనుకబడిపోయి ఉంటే తమ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల ద్వారా మరిన్ని నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేసుకోవాలి. దానిని వదిలేసి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బతుకుతున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన 'ప్రత్యేక' రాష్ట్రం కావాలంటున్నారు. అయితే స్థానిక ప్రజల అభిమతం మాత్రం అలా లేదనేది నిర్వివాదాంశం. ప్రత్యేక రాష్ట్రం ద్వారా ఎవరిని ఉద్ధరించాలని ఆయన అనుకుంటున్నారో తెలియడం లేదు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని మేధావులు చెబుతుంటే వైఎస్ మరణానంతరం తనకిక ఎదురేముందని పేట్రేగిపోతున్నారు కేసీఆర్. చివరికి విద్యార్థుల్లోనూ ప్రత్యేకవాద విషాన్ని ఎక్కించి, ఒకరిని అగ్నికి ఆహుతి చేశారు. ఇప్పటికైనా హింసామార్గాన్ని వీడి, సామరస్యంగా చెప్పాలంటే 'స్టేటస్ కో' (అంటే సమైక్యాంధ్రగానే)ను కొనసాగిస్తే మంచిది.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి