స్లయిడ్‌షో

Loading...

సైన్ ఇన్ అవ్వండి

Daily Calendar

సోమవారం 1 మార్చి 2010

చిరంజీవి దారెటు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రంగుల ప్రపంచం నుంచి (రణ రంగమవుతున్న) ఈనాటి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి దారెటు? అనేది ప్రస్తుతం ఆయన అభిమానులను విపరీతంగా తొలచివేస్తోంది. కళామాతల్లి ఒడిలో ఇంతింతై వటుడింతై నెంబర్‌వన్‌గా ఎదిగిన కొణిదల చిరంజీవి రాజకీయాల్లో మాత్రం చతికిలపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పరాభవం.....తాను సినిమా రంగంలో వలే ఇక్కడ (రాజకీయాలు) కూడా పరిణతి సాధిస్తానని ఎంతో హుందాగా...అంతే ధైర్యంగా చెప్పారాయన. అయితే డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరుడి మరణంతో రాష్ట్ర రాజకీయాలు తారుమారయ్యాయి. తెరాస చీఫ్ కేసీఆర్ 'ప్రత్యేక తెలంగాణ' ఇస్తారా? చస్తారా? అంటూ ఏపీ రాజకీయాలు హింసాత్మకంగా మారిపోయే విధంగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కింగ్ అవ్వాలనుకుని....చివరకు కింగ్ మేకర్ కూడా కాలేకపోయిన చిరు ప్రస్తుతం ఎటు పయణించాలో తెలియక అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. అందరివాడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇటు తెలంగాణకు....అవకాశవాద రాజకీయాలతో అటు మరో ప్రత్యేక రాష్ట్రానికి (ప్రత్యేక ఆంధ్ర) జై కొట్టలేక సతమతమవుతున్నారు. పార్టీలో తల పండిన నేతలెవరూ లేకపోవడం....పార్టీ కార్యక్రమాలు చప్పగా సాగుతుండటం (ఒకరకంగా ఉనికే ప్రశ్నార్థకంగా మారింది)....చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోగా పార్టీ ఏమవుతుందోనన్న ఆందోళన ఫ్యాన్స్‌లో నానాటికి ఎక్కువవుతోంది. మరోవైపు ఆయన తిరిగి సినిమాలు చేయొచ్చనే ఊహాగానం కూడా కొద్ది నెలలుగా కొనసాగుతోంది. ఆయన కూడా ఇటీవల రెండు మూడు సందర్భాల్లో అభిమానులు కోరితే తిరిగి నటిస్తానన్న విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు. మరి అదే జరిగితే చిరంజీవి రీఎంట్రీకి ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి